Oomen Chandy : కేరళ 10th మాజీ సీఎం ఊమెన్ చాందీ ఇక లేరు
చికిత్స పొందుతూ బెంగళూరులో కన్నుమూత
Oomen Chandy : కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మంగళవారం కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏఐసీసీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఊమెన్ చాందీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరింది. కేరళ రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చారు. అత్యంత జనాదరణ పొందిన నాయకులలో ఒకడిగా గుర్తింపు పొందారు. ఆయనను అన్ని వర్గాల వారు ఆప్తుడిగా చూశారు. గౌరవించారు కూడా. కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును, అత్యంత శక్తివంతమైన నాయకుడిని కోల్పోయింది.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే , మాజీ చీఫ్ లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ , సీఎంలు సిద్దరామయ్య, భూపేష్ బఘేల్ , ఏకే ఆంటోనీ, జైరాం రమేష్ , పవన్ ఖేరా, గులాం నబీ ఆజాద్ , తదితర నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కేరళ సీఎం పినరయి విజయన్ గొప్ప నాయకుడిని, అంతకు మించిన స్నేహితుడిని తాను కోల్పోయానని పేర్కొన్నారు. ఇద్దరం మంచి మిత్రులం. భావజాలం వేరైనా ఒకరినొకరం అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు. ఊమెన్ చాందీ(Oomen Chandy) సమర్థుడైన పరిపాలకుడు. ప్రజల జీవితాలలో సన్నిహితంగా ఉన్న అరుదైన నాయకుడంటూ కితాబు ఇచ్చారు సీఎం.
ఊమెన్ చాందీ కేరళకు రెండుసార్లు సీఎంగా పని చేశారు. 27 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 11 సార్లు ఎన్నికల్లో గెలుపొందాడు. ఇది ఓ రికార్డ్. వివిధ క్యాబినెట్ లలో మంత్రిగా, నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
Also Read : Merry Christamas Movie : డిసెంబర్ 15న మెర్రీ క్రిస్మస్ రిలీజ్