Kerala Governor : ఖాన్ క‌న్నెర్ర నిరూపిస్తే త‌ప్పుకుంటా

ఆరోప‌ణ‌లు నిరూపిస్తే త‌ప్పుకుంటా

Kerala Governor : కేర‌ళ‌లో సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ మ‌ధ్య దూరం పెరుగుతోంది. చివ‌ర‌కు స‌వాళ్లు విసురుకునేంత దాకా వెళ్లింది వ్య‌వ‌హారం. రాష్ట్రంలోని తొమ్మిది యూనివ‌ర్శిటీల‌కు చెందిన వైస్ ఛాన్స‌ల‌ర్లు వెంట‌నే రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ ఆదేశించారు.

ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ చేయ‌డం క‌ల‌కలం రేపింది. దీనిని స‌వాల్ చేస్తూ వీసీలు కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌వంబ‌ర్ 3 డెడ్ లైన్ విధించారు గ‌వ‌ర్న‌ర్ వీసీల‌కు. ఈ త‌రుణంలో సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ సీరియ‌స్ గా స్పందించారు.

వైస్ ఛాన్స్ ల‌ర్ల‌ను తొల‌గించే అధికారం గ‌వ‌ర్న‌ర్ కు లేద‌న్నారు. ప్ర‌భుత్వం సిఫార‌సు చేస్తుంద‌ని కేవ‌లం సంత‌కం మాత్ర‌మే చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై అభ్యంత‌రం తెలిపారు ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్(Kerala Governor). గ‌వ‌ర్న‌ర్ అతి జోక్యం చేసుకుంటున్నార‌ని రాజ్యాంగాన్ని ర‌క్షించాల్సింది పోయి ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్ట‌డంపైనే ఫోక‌స్ పెడుతున్నారంటూ మండిప‌డ్డారు సీఎం.

దీనిని తాము ఎదుర్కొంటామ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఒక‌ప్పుడు డ్ర‌గ్స్ , మ‌ద్యానికి పంజాబ్ పేరుండేదని కానీ కేర‌ళ ఇప్పుడు దానిని అధిగ‌మించిందంటూ గ‌వ‌ర్న‌ర్ ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మ‌ద్యాన్ని అడ్డం పెట్టుకుని ఆదాయం పొందాల‌ని అనుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.

త‌న‌పై సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని నిరూపిస్తే తాను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని ఖాన్ స‌వాల్ విసిరారు. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : మేం దొంగ‌ల‌మా సంఘ వ్య‌తిరేకుల‌మా – సోరేన్

Leave A Reply

Your Email Id will not be published!