Kerala Governor : వీసీల రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ డెడ్ లైన్

నోటీసుపై విచార‌ణ చేప‌ట్టిన కేర‌ళ హైకోర్టు

Kerala Governor : కేర‌ళ‌లో సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కు గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ మ‌ధ్య అగాధం పెరిగింది. తాజాగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో యూనివ‌ర్శిటీల‌కు సంబంధించి ఎంపిక చేసిన వైస్ ఛాన్స్ ల‌ర్స్ స‌రైన‌ది కాదంటూ గ‌వ‌ర్న‌ర్(Kerala Governor) అభ్యంత‌రం తెలిపారు. ఈ మేర‌కు తొమ్మిది యూనివ‌ర్శిటీల‌కు సంబంధించిన వీసీల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

దీనిని స‌వాల్ చేస్తూ వీసీలు కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్. ఇదే స‌మ‌యంలో సోమ‌వారం సాయంత్రం హైకోర్టు సుదీర్ఘంగా విచార‌ణ చేప‌ట్టింది. ఇది ఇంకా కొన‌సాగుతోంది. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు సీఎం. గ‌వ‌ర్న‌ర్ కు వైస్ ఛాన్స్ ల‌ర్ ను తొల‌గించే అధికారం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న పూర్తిగా ఆర్ఎస్ఎస్ చేతిలో కీల‌క బొమ్మ‌గా మారాని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో మ‌రో కీల‌క నోటీసులు వీసీల‌కు జారీ చేశారు గ‌వ‌ర్న‌ర్. దీనిని తీవ్రంగా తీసుకున్నారు. ఓ వైపు హైకోర్టు విచార‌ణ జ‌రుపుతుండ‌గానే గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ కొత్త‌గా నోటీసులు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

విచిత్రం ఏమిటంటే న‌వంబ‌ర్ 3న డెడ్ లైన్ విధించింది వీసీల‌కు. ఆ లోపు త‌ప్పుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు గ‌వ‌ర్న‌ర్. ఇదిలా ఉండ‌గా విచార‌ణ జ‌రుగుతుండ‌గానే గ‌వ‌ర్న‌ర్ ఇంత త్వ‌ర‌గా నోటీసులు జారీ చేయాల్సి వ‌చ్చిందంటూ సీఎం నిప్పులు చెరిగారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో ఈ స‌మ‌స్య చ‌ర్చ‌కు దారి తీసింది.

Also Read : కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ తీరుపై సీఎం సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!