Kerala High Court : పోర్న్ చూస్తే నేరం కాదు
కేరళ హైకోర్టు సంచలన తీర్పు
Kerala High Court : కేరళ – పోర్న్ చూడాలా వద్దా అన్న దానిపై సంచలన తీర్పు వెలువరించింది కేరళ హైకోర్టు(Kerala High Court). ఇప్పటికే పోర్న్ విషయంపై పెద్ద రాద్ధాంతం చోటు చేసుకుంది. అమెరికా లాంటి అభివృద్ది చెందిన దేశాలలో పోర్న్ ను లీగలైజ్ చేసినా కొన్ని దేశాలలో ఇది నిషిద్దం. మరికొన్ని దేశాలలో ఈజీగా దొరుకుతోంది. ప్రపంచ మార్కెట్ లో పోర్న్ బిగ్ మార్కెట్ నెలకొంది.
Kerala High Court Shocking Commens
తాజాగా కేరళ హైకోర్టు పోర్న్ కు సంబంధించిన కేసును విచారించింది. ఈ మేరకు సంచలన తీర్పు చెప్పింది. సీక్రెట్ గా పోర్న్ చూడటం ఎంత మాత్రం నేరం కాదన్నారు. అది వారి వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలో కేసు నమోదు చేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకున్నట్లే అవుతుందని తీర్పు చెప్పింది కోర్టు.
అశ్లీల ఫోటోలు, వీడియోలను ప్రైవేట్ (దొంగచాటు)గా చూడటం ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం అశ్లీలతగా పరిగణించ బడదని కోర్టు తీర్పు చెప్పింది. 2016లో రోడ్డు పక్కన నిలబడి పోర్న్ చూస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు సెప్టెంబర్ 5న కోర్టులోకి వచ్చింది. పోర్న్ చూడటం అనేది వ్యక్తిగతం , అది నేరం కానే కాదని తీర్పు చెప్పారు జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ .
సెక్షన్ 292 కింద అతనిపై నమోదైన క్రిమినల్ కేసులను రద్దు చేయండి. ఒకవేళ బహిరంగంగా ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తే అప్పుడు సెక్షన్ 262 ప్రకారం శిక్ష పరిధిలోకి వస్తారంటూ స్పష్టం చేశారు. తాజాగా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది.
Also Read : Bangalore Police Book : సుధీర్ చౌదరిపై కేసు నమోదు