Kerala Medical College Scam : ఎయిర్ పోర్ట్ లో బిషప్ కు బిగ్ షాక్
కేరళ మెడికల్ కాలేజ్ స్కామ్
Kerala Medical College Scam : కేరళలో చర్చి నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ తరుణంలో బ్రిటన్ వెళ్లేందుకు సిద్దమైన బిషప్ ఎ. ధర్మ రాజ్ ను కేరళ లోని తరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేఏరకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా బిష్ ఎ. ధర్మ రాజ్ రసాలమ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
ఆయన బ్రిటన్ కు వెళ్లేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఎయిర్ పోర్ట్ లో బిషప్ కి బిగ్ షాక్ తగిలింది. డాక్టర్
సోమర్ వెల్ మెమోరియల్ సీఎస్ఐ మెడికల్ కాలేజీ నిర్వహణలో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తోంది ఈడీ.
ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోందని, పూర్తి కాలేదని ఈ సమయంలో బ్రిటన్ కు వెళితే తిరిగి వచ్చేందుకు వీలు
ఉండదని స్పష్టం చేసింది ఈడీ.
బిషప్ ముందస్తు ప్లాన్ లో భాగంగానే బ్రిటన్ కు బయలు దేరినట్లు ముందే గ్రహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అన్ని
ఎయిర్ పోర్ట్ లకు సమాచారం అందించారు.
దీనిపై స్పందించిన ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ వెంటనే బిషప్ ను గుర్తించి వెళ్లకుండా నిలిపి వేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో
ఈ సంఘటన చోటు చేసుకుంది.
బిషప్ ను జూలై 27న తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. చర్చి ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రిలో మెడికల్ సీట్లు(Kerala Medical College Scam) ఇప్పిస్తానంటూ విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు బిషప్ పై ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ సీఎస్ఐ దక్షిణ కేరళ డియోసెస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. ఇదిలా ఉండగా దీనిపై ఇప్పటికే క్రైం బ్రాంచ్ విచారణ
జరిపిందని క్రిష్టియన్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ ఫాదర్ సీఆర్ గాడ్విన్ తెలిపారు.
Also Read : ఖాకీల నిర్వాకం కాంగ్రెస్ ఆగ్రహం