Kerala Name Change : ఇకపై కేరళ పేరు ‘కేరళం’
సీఎం తీర్మానం అసెంబ్లీ ఆమోదం
Kerala Name Change : కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ వేదికగా ఆయన కీలక తీర్మానం ప్రవేశ పెట్టారు. కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ పేరు వాడ కూడదని , దాని పేరు మార్చాలని అనుకున్నట్లు తెలిపారు. సభ సాక్షిగా ప్రకటించారు. ఈ మేరకు కేరళ రాష్ట్రం(Kerala Name Change) పేరును కేరళంగా మారుస్తున్నట్లు వెల్లడించారు.
Kerala Name Change Keralam
ఇదిలా ఉండగా కేరళ సీఎం పినరయి వజియన్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లోనూ కేరళ పేరును కేరళంగా సూచించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తప్పక ఉండాలని స్పష్టం చేశారు సీఎం పినరయి విజయన్.
సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానానికి కేరళ అసెంబ్లీ స్పీకర్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే కేరళను మలయాళంలో కేరళంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇతర భాషల్లోనూ అలాగే వ్యవహరించాలని సీఎం విజయన్ కేంద్రంలోని మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ కు తెలియ చేశారు.
ఇదిలా ఉండగా కేరళ సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానం ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read : Pawan Kalyan : అర్చకుడిపై దాడి దారుణం – పవన్