K Sudhakaran : కేరళ సర్కార్ పై కాంగ్రెస్ కన్నెర్ర
వాటర్ స్పోర్ట్స్ రేస్ కు షాకు ఆహ్వానం
K Sudhakaran : భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేరు మద దక్షిణాది రాష్ట్రమైన కేరళలో అత్యంత రంగు రంగుల వాటర్ స్పోర్ట్స్ రేస్ కు శ్రీకారం చుట్టుంది పినయర్ విజయన్ కమ్యూనిస్ట్ సర్కార్.
ఈ రేస్ కు సంబంధించి ప్రత్యేకంగా రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర(Amit Shah) షాకు ఆహ్వానం పలికింది. ఆయనకు ఇన్విటేషన్ పంపడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ పార్టీ.
షాకు పంపిన ఆహ్వానం సీఎం పినరయి విజయన్ కు మత శక్తుల పట్ల విధేయత, బీజేపీ పట్ల సీఎంకు ఉన్న ప్రేమ వెల్లడిస్తోందంటూ ఆరోపించింది. దీనిపై సీరియస్ గా స్పందించింది కేరళ ప్రభుత్వం.
అమిత్ షాకు ఆహ్వానం పంపడాన్ని సమర్థించింది. అమిత్ షా తో పాటు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, సెప్టెంబర్ 4న అలప్పుజాలోని పున్నమడ సరస్సు వద్ద జరిగే అద్భుతమైన ఈవెంట్ ను వీక్షించేందుకు ఆహ్వానించడం జరిగిందని స్పష్టం చేశారు సీఎం పినరయి విజయన్(Kerala CM).
అంతే కాకుండా ఒక రోజు ముందు 30వ దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగిందని వెల్లడించారు కేరళ సీఎం.
ఇదిలా ఉండగా సంఘ్ పరివార్ నేతలకు సీపీఎం కేరళ యూనిట్ ఇస్తున్న మితి మీరిన ప్రాధాన్యత పార్టీ పోలిట్ బ్యూరో ఆశీస్సులతోనా కాదా అనేది స్పష్టం చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కేపీసీసీ చీఫ్ కె. సుధాకరన్(K Sudhakaran) కోరారు.
Also Read : రూ. 24 వేల కోట్లకు ఐసీసీ మీడియా రైట్స్