Ghulam Nabi Azad : గులాం నబీ ఆజాద్ కీలక ప్రకటన
జెండా..ఎజెండా వెల్లడిస్తామన్న నేత
Ghulam Nabi Azad : కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన 50 ఏళ్ల పాటు కొనసాగారు. కీలక పాత్ర పోషించారు.
పార్టీలో పొసగక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. త్వరలో జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొని సొంత పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన వారం రోజుల తర్వాత ఆదివారం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) మీడియాతో మాట్లాడారు.
తన పార్టీకి సంబంధించిన కీలక వివరాలను ప్రకటించారు. పార్టీ పేరుపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం నాడు పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండా ఏమిటనేది చర్చకు రానుంది.
దీనికి సంబంధించి కీలకమైన వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. పార్టీ పేరు, దాని విధి విధానాలపై రేపు ప్రకటిస్తామని చెప్పారు గులాం నబీ ఆజాద్.
ఇవాళ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశం కావడం జరిగిందన్నారు. తన కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు గులాం నబీ ఆజాద్ పై విధంగా సమాధానం చెప్పారు.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలు పార్టీకి పేరు, జెండాను నిర్ణయిస్తామరని ఆజాద్ గతంలో వెల్లడించారు. బారాముల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన విషయాన్ని ప్రకటించారు.
నేను నా పార్టీకి అందరూ అర్థం చేసుకోగలిగేలా హిందూస్థానీ పేరు పెడతానని స్పష్టం చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్దరించాలని గతంలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై ఆయన మాట మార్చారు.
Also Read : హిందువులు రెచ్చిపోతే తట్టుకోలేరు – రాజ్ ఠాక్రే