KGF-2 Movie : ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ , ప్రముఖ సినీ క్రిటిక్ గా పేరొందిన ఉమైర్ సంధు సంచలన కామెంట్స్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కేజీఎఫ్-2 మూవీని (KGF-2 Movie )ఆకాశానికి ఎత్తేశాడు.
ఏకంగా ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ యశ్ తో పాటు బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ నటించాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ నడుస్తోంది.
ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. ఇక రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటి వరకు రూ. 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది.
ఇక నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ -2 (KGF-2 Movie )ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్ , టీజర్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం విడుదలయ్యే కేజీఎఫ్ -2 పై అందరి దృష్టి నెలకొని ఉంది. కన్నడ నాట ఈ మూవీ సంచలనం కలిగించింది. దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. కోట్లు కొల్లగొట్టింది.
ఈ తరుణంలో కేజీఎఫ్ కు సీక్వెల్ గా తీసుకు వస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క మూవీతో పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు యశ్. రాబోయే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ ఎత్తున ఖర్చు పెట్టి చిత్రాన్ని తీశారు. ఈ సందర్భంగా కేజీఎఫ్ -2 గురించి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కేజీఎఫ్ -2 దేశాన్నే కాదు ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేస్తుందన్నాడు. తాను చూశానని ఇక దీనికి తిరుగు లేదన్నాడు. యశ్ , దత్ నటన అద్భుతమన్నాడు.
Also Read : అల్లా రఖా రెహమాన్ పోస్ట్ కలకలం