KGF-2 Movie Team : కేజీఎఫ్ -2 మూవీ టీం ప్ర‌త్యేక పూజ‌లు

కేజీఎఫ్ -2 మూవీ విడుద‌ల తేదీ ఫిక్స్

KGF-2 Movie Team : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ న‌టించిన కేజీఎఫ్ దేశాన్ని ఒక ఊపు ఊపాయి. వ‌సూళ్ల‌ను తిర‌గ రాసింది ఈ మూవీ. పాన్ ఇండియాను ఊపేసింది. భారీ ఎత్తున బాక్సుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది.

దీంతో కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్ -2 మూవీని(KGF-2 Movie Team) మ‌రోసారి తెర‌కెక్కించాడు. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మైంది. చివ‌ర‌కు సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై కోట్లు కొల్ల గొట్టింది ఈ మూవీ.

ప్ర‌స్తుతం కేజీఎఫ్ -2 మ‌రోసారి చ‌రిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. కాగా అమీర్ ఖాన్ మూవీ , కేజీఎఫ్ -2 (KGF-2 Movie Team)రెండు చిత్రాలు ఒకేసారి విడుద‌ల కానుండ‌డంతో ఎవ‌రో ఒక‌రు త‌గ్గుతార‌ని ప్రచారం జ‌రిగింది.

కానీ చీవ‌ర‌కు ఇవాళ కేజీఎఫ్ -2 మూవీ మేక‌ర్స్ విడుద‌ల తేదీని ఫిక్స్ చేశారు. కాగా ఈ ఒక్క మూవీతో య‌శ్ పాన్ ఇండియా స్టార్ గా మారి పోయాడు. ఈ సినిమా కోసం ల‌క్ష‌లాది మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని.

ఇందులో సంజ‌య్ ద‌త్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విధంగానే మూవీ మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా కేజీఎఫ్ -2 మూవీని విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా ఇవాళ హీరో య‌శ్ , ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తో పాటు, చిత్ర బృందం క‌ర్ణాట‌క‌లోని శ్రీ మూకింబికా ఆల‌యం, ఉడిపి లోని వినాయ‌క ఆల‌యాన్ని సంద‌ర్శించి పూజ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : రికార్డుల వేట‌లో పుష్ప‌రాజ్

Leave A Reply

Your Email Id will not be published!