KGF-2 Movie : 27న కేజీఎఫ్‌-2 ట్రైల‌ర్ రిలీజ్

ఏప్రీల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల

KGF-2 Movie : కేజీఎఫ్ ఒకే ఒక్క మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రం సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. కోట్లు కొల్ల‌గొట్టింది. క‌ర్ణాట‌కలోని కోలార్ బొగ్గు గ‌నుల్లో చోటు చేసుకున్న మాఫియాను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.

అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌తో త‌న‌దైన మేకింగ్ తో స‌త్తా చాటాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌కుల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు అందుకుంది ఈ చిత్రం. ప్ర‌ధానంగా క‌న్న‌డ హీరో య‌శ్ పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు.

కేజీఎఫ్ భారీ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఆ మూవీకి సీక్వెల్ గా కేజీఎఫ్‌-2 పేరుతో తీశాడు. ప్ర‌స్తుతం ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సంజ‌య్ ద‌త్ ఇందులో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర చేశాడు.

విచిత్రం ఏమిటంటే ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ఆ మూవీ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ చిత్రం బిగ్ రేటింగ్ తో దూసుకు పోయింది. వంద కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది.

క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో కేజీఎఫ్ ఓ సెన్సేష‌న్. ఇక సీక్వెల్ చిత్రానికి సంబంధించి క‌రోనా ఎఫెక్ట్ ఉండ‌డంతో షూటింగ్ కు కొంత ఇబ్బంది ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత షూటంగ్ కూడా పూర్తి చేసుకుంది.

కేజీఎఫ్ -2కి సంబంధించి ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా మూవీని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాజాగా ఫ్యాన్స్ కు అదిరి పోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న కేజీఎఫ్ -2 మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your Email Id will not be published!