KGF2 Movie : భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. సౌత్ ఇండియా సినిమా తనదైన మార్క్ కనబరుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన పుష్ప ది రైజ్ ఏకంగా కోట్లు కొల్లగొట్టింది.
ఆ తర్వాత జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సులు బద్దలు కొడుతూనే ఉంది. దీనిని బ్రేక్ చేసేందుకు మరో మూవీ వచ్చింది. అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్-2(KGF2 Movie). కేజీఎఫ్ కు ఇది సీక్వెల్ సినిమా. కన్నడ సూపర్ స్టార్ యశ్ ,
బాలీవుడ్ సూపర్ యాక్టర్ సంజయ్ దత్, శ్రీనిధి, రవీనా టాండన్ కలిసి నటించిన ఈ చిత్రం వసూళ్లలో సునామీ సృష్టిస్తోంది. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దుమ్ము రేపుతోంది.
ఎక్కడ చూసినా కేజీఎఫ్-2 మూవీ గురించిన చర్చే వినిపిస్తోంది. ఇక నెట్టింట్లో దాని గురించిన పోస్ట్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ రూ. 2 కోట్లు సాధిస్తుందని అంచనా వేశారు.
కానీ ఇప్పటికే కేజీఎఫ్ -2 ఆ దిశగా ముందుకు వెళుతుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించిన వివరాల మేరకు ఆరు రోజులలో కేజీఎఫ్ -2 (KGF2 Movie)ఏకంగా రూ. 645 కోట్లు వసూలు చేసింది.
ఇది భారతీయ సినీ చరిత్రలో ఓ రికార్డు అని ఆయనే పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే ఒక్క బాలీవుడ్ లోనే ఈ సిక్స్ డేస్ లో రూ. 238.70 కోట్లను రాబట్టడం ఆ సినీ రంగాన్ని విస్తు పోయేలా చేసింది.
కాగా బ్రేక ఈవెన్ రావాలంటే ఇంకా రూ. 75 కోట్లు రావాల్సి ఉందని అంచనా. ఈ డబ్బులు రావడానికి పెద్దగా కష్ట పడాల్సిన పని లేదు. ఎందుకంటే రాఖీ భాయ్ ఎక్కడా ఆగడం లేదు.
Also Read : ఎఫ్-3 సింగిల్ సాంగ్ ప్రోమో సందడి