Yumnum Khemchand : దేశంలోని ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే గోవా , ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించి హైకమాండ్ ఇప్పటికే సీఎం అభ్యర్థులుగా పేర్లు కూడా డిక్లేర్ చేసింది.
కానీ మరో స్టేట్ లో ఒంటరిగానే పవర్ లోకి వచ్చిన మణిపూర్ లో మాత్రం ఇంకా సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేదు. దీంతో రాష్ట్రంలో కాషాయ శ్రేణులు, కార్యకర్తలు, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోసారి సీఎంగా ఎన్. బీరేన్ సింగ్ కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రకటించక పోవడంతో ఇద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముందుగా ఎవరినీ ప్రకటించ లేదు పార్టీ. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోనే పార్టీ టికెట్లను కేటాయించింది. ఆయన సారథ్యంలోనే ప్రచారం చేపట్టింది.
బీజేపీకి అనుబంధ సంస్థగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం కలిగిన యుమ్ నమ్ ఖేమ్ చంద్ సింగ్(Yumnum Khemchand )పేరును కూడా పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
మూడో ఆప్షన్ గా ఆయనను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు టాక్. గత అసెంబ్లీలో స్పీకర్ గా కూడా ఖేమ్ చంద్ పని చేశారు. తాజాగా ఆయన అయితే బావుంటుందని సమాచారం.
ఆయనను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా హై కమాండ్ పిలవడం ఇందుకు బలం చేకూరుతోంది. ఖేమ్ చంద్ తో పాటు ప్రస్తుతం సీఎం రేసులో ఉన్న బీరే్న్ సింగ్గ , బిస్వజిత్ కూడా ఉన్నారు.
బీరేన్ సింగ్ , బిస్వజిత్ మధ్య ఉన్న ఆధిపత్య పోరును తగ్గించేందుకు మూడో ప్రత్యామ్నాయంగా ఖేమ్ చంద్ ను తెరపైకి తీసుకు వచ్చింది.
Also Read : నేరస్థుల గుర్తింపు కోసం కొత్త చట్టం