Rakesh Tikait : ఈ దేశంలో చంపినా చ‌ర్చే లేదు – టికాయ‌త్

కేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్

Rakesh Tikait : ఈ దేశంలో ఏం జ‌రుగుతోంది. కేవ‌లం అనిల్ అంబానీ, గౌతం అదానీ, త‌దిత‌ర వ్యాపార‌వేత్త‌ల ప్ర‌యోజ‌నాల‌కే కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తోంద‌ని నిప్పులు చెరిగారు భార‌తీయ కిసాన్ మోర్చా జాతీయ నేత రాకేష్ టికాయ‌త్.

ఆ ఇద్ద‌రి వ్యాపార‌స్తుల కోసం వంద‌ల ఎక‌రాల్లో అడ‌వుల‌ను న‌రికేసినా ఈరోజు వ‌ర‌కు ప్ర‌శ్నించిన పాపాన పోలేద‌న్నారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాకేశ్ టికాయ‌త్(Rakesh Tikait).

పేద‌లు, శ్రామికులు, రైతులు, బ‌డుగులు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనార్టీలు అంటే ప్ర‌భుత్వానికి అలుసుగా మారింద‌న్నారు. కూలీల‌ను బ‌ల‌వంతంగా అడ్డుకుంటున్న పోలీసుల తీరుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు తికాయ‌త్.

ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోతోంద‌ని ఆవేద‌న చెందారు. ఇది ఒక ర‌కంగా చెప్పాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు తికాయ‌త్.

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఆక‌లైతే అన్నం పెట్టే అన్న‌దాత‌లు సుదీర్ఘ కాలం పాటు పోరాడి ప్రాణాలు కోల్పోయినా వారిని ఆదుకున్న దాఖాలు లేవు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీలు ప్ర‌భుత్వం మ‌రిచి పోవ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు.

పంట‌లు పండించే రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని , క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు మ‌రోసారి రాకేశ్ టికాయ‌త్(Rakesh Tikait). ప్ర‌శ్నించే వాళ్ల‌ను సంఘ విద్రోహ శ‌క్తులుగా ఆలోచించ‌డం అల‌వాటుగా మారింద‌ని పేర్కొన్నారు.

ఏది ఏమైనా రాను రాను బ‌ల‌వంతులే బ‌తికేలా పేద‌లు చ‌ని పోయేలా చేస్తుండ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు.

Also Read : అధికారం అశాశ్వ‌తం స‌త్యం శాశ్వ‌తం

Leave A Reply

Your Email Id will not be published!