kinnerasani : కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని ఫస్ట్ గ్లిమ్స్ వీడియో విడుదల
Kalyan Dev Kinnerasani First Glims Video Released
kinnerasani : హ్యాపెనింగ్ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్టర్ రమణ తేజ(అశ్వధామ ఫేమ్) కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కిన్నెరసాని. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కంటెంట్ కి పెద్ద పీఠ వేస్తూ, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ వారు కిన్నేసాని చిత్రాన్ని సైతం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కిన్నెరసాని టైటిల్ లుక్ పోస్టర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాది సందర్భంగా కిన్నెరసారి చిత్రం బృందం ఓ గ్లిమ్స్ ని సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ సినిమా సాయిరిషిక సమర్పణలో రజనీ తళ్లూరి, రవి చింతల ఈ సినిమాకు నిర్మాతలుగా రూపొందుతుంది. విజేత వంటి క్లాసిక్ హిట్ అందుకని ప్రస్తుతం సూపర్ మచ్చి అనే కమర్షీయల్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న కళ్యాణ్ దేవ్ నుంచి మూడో సినిమాగా ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ కిన్నేరసాని రాబోతుంది.
ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

No comment allowed please