Kiren Rijiju : న్యాయమూర్తి నాలుక కోస్తారా – రిజిజు
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన మంత్రి
Kiren Rijiju : రాహుల్ గాంధీకి 2019 పరువు నష్టం కేసులో 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక కోస్తామంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తమిళనాడు నేత హెచ్చరించడం కలకలం రేపింది. శనివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) తీవ్రంగా స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు ఇప్పుడేమీ కొత్త కాదన్నారు. గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు ఆ పార్టీకి చెందిన వారు చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. తీర్పులు వ్యతిరేకంగా వస్తే ఇలా బెదిరింపులకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
భారత దేశ ఎమర్జెన్సీ కాలానికి ముందే కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థపై దాడి చేసిందని ,ప్రస్తుతం నిరాశతో దాడిని తీవ్రతరం చేసిందన్నారు కిరెన్ రిజిజు. ఆ పార్టీకి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని కానీ తమకు ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ నీతులు వెల్లిస్తున్నారని కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి(Kiren Rijiju).
క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించినందుకు సూరత్ లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నాలుక కోస్తామని తమిళనాడు లోని దిండిగల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మణికందన్ బెదిరించినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాము పవర్ లోకి రాగానే మా అధినేతని జైలుకు పంపేలా తీర్పు చెప్పిన జడ్జి నాలుక కోస్తామంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కవాతులో ప్రకటించడం కలకలం రేపింది.
Also Read : ఫేక్ న్యూస్ ను కేంద్రం నిర్ణయిస్తుందా