Kiren Rijiju : కిర‌ణ్ రిజిజు షాక్ న్యాయ శాఖ మార్పు

అర్జున్ రామ్ మేఘ్వాల్ కు అప్ప‌గింత

Kiren Rijiju : కేంద్రంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజుకు బిగ్ షాక్ త‌గిలింది. మోదీ కేబినెట్ లో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారు. తాజాగా ఆయ‌నకు ఉన్న శాఖ‌ను కేంద్రం తొల‌గించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఏడాది స‌మ‌యం ఉంది. ఈ త‌రుణంలో కిరెన్ రిజిజు ను తొల‌గించ‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌ర్గాల‌లో, కేంద్ర కేబినెట్ లో క‌ల‌క‌లం రేపింది. పూర్తిగా చ‌ర్చ నీయాంశంగా మారింది. వివాద ర‌హితుడిగా గుర్తింపు పొందారు కిరెన్ రిజిజు.

గ‌త కొంత కాలం నుంచీ కేంద్రానికి న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు న‌డుస్తోంది. ఆయ‌నను త‌ప్పించ‌డం వెనుక గ‌ల కార‌ణాలు ఏమిట‌నే దానిపై హై క‌మాండ్ ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. కిరెణ్ రిజిజుకు అప్రధాన్య పోస్టుకు ఎంపిక చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా ఆయ‌న‌ను త‌ప్పించారు మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా త్ర‌యం. కిరెన్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయ శాఖ అప్ప‌గించారు. ఆయ‌నకు స్వ‌తంత్ర బాధ్య‌త క‌లిగిన మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

రిజిజు కేంద్ర స‌ర్కార్ లో అత్యంత ఉన్న‌త స్థాయి మంత్రుల‌లో ఒక‌డిగా ట్ర‌బుల్ షూట‌ర్ గా గుర్తింపు పొందారు. ఆయ‌న‌కు క్యాబినెట్ హొదాతో న్యాయ మంత్రిత్వ శాఖ‌కు ప‌దోన్న‌తి పొందిన ఒక ఏడాది లోపే త‌క్కువ ప్రాధాన్య‌త క‌లిగిన ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ‌కు మార్చ‌బ‌డ్డారు.

Also Read : PAK Army Chief

 

Leave A Reply

Your Email Id will not be published!