Kiren Rijiju : సుప్రీంకోర్టులో 71 వేల‌ కేసులు పెండింగ్

రాజ్య‌స‌భ‌లో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు

Kiren Rijiju : ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా దేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టులో 71 వేల‌కు పైగా కేసులు ప‌రిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఈ విష‌యాన్ని రాజ్యస‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) .

వీటిలో 10,000 కేసులు ప‌నికి రాకుండా పోయాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం సంద‌ర్బంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సావ‌ధానంగా స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ ఏడాది ఆగ‌స్టు 2 నాటికి దేశంలో 71,411 కేసులు భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పెండింగ్ లో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు కిరెన్ రిజిజు.

ఇందులో 56,000 సివిల్ కేసులు ఉండ‌గా 15,000 ల‌కు పైగా క్రిమిన‌ల్ (నేర‌) కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని లిఖిత పూర్వ‌కంగా వెల్లడించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి.

ఈ మొత్తం కేసుల్లో ప‌ది వేల‌కు పైగా కేసులు ద‌శాబ్ద కాలంగా ప‌రిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయ‌ని తెలిపారు. 42,000 కేసులు ఐదేళ్ల లోపు పెండింగ్ లో ఉన్నాయి.

18,314 ఐదు నుండి 10 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా 2016లో వివిధ హైకోర్టు్లో 40,28,591 కేసులు పెండింగ్ లో ఉండ‌గా ఈ ఏడాది జూలై 29 నాటికి వాటి సంఖ్య 59,55,907కి పెరిగింద‌న్నారు కిరెన్ రిజిజు.

50 శాతం పెరిగింద‌ని రిజిజు మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ఇక జిల్లా , స‌బార్డినేట్ కోర్టులు కూడా 2016 జూలై 29 మధ్య కేసుల‌లో 50 శాతం పెరిగాయి.

ఇదే ఏడాదిలో 2.82 కోట్ల‌కు పైగా కేసులు పెండింగ్ లో ఉండ‌గా ఈ ఏడాది 4.24 కోట్ల‌కు పైగా ఉన్నాయి.

Also Read : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!