Kiren Rijiju Nehru : నెహ్రూ వల్లనే జమ్మూ కాశ్మీర్ సమస్య
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కామెంట్స్
Kiren Rijiju Nehru : దేశ మాజీ ప్రధాన మంత్రి, దివంగత జవహర్ లాల్ నెహ్రూపై(Jawaharlal Nehru) సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. ఆయన ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా మారారు. మొన్నటికి మొన్న న్యాయ వ్యవస్థలో రాజకీయాలు ఎక్కువై పోయాయని, కొలీజియం వ్యవస్థ దారుణంగా ఉందన్నారు.
ఈ తరుణంలో తాజాగా నెహ్రూపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ సమస్య ఇంకా కొనసాగడానికి కారణం ఆనాటి ప్రధాని నెహ్రూనే అంటూ ఆరోపణలు గుప్పించారు కిరెన్ రిజిజు(Kiren Rijiju) .
మాజీ కాశ్మీర్ పాలకుడు మహారాజా హరి సింగ్ జూలై 1947లో భారత్ లో చేరాలని అనుకున్నారని కానీ జవహర్ లాల్ నెహ్రూ తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకునేందుకు ఆలస్యం చేశారంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి.
నెహ్రూ ఈ ఒక్క పొరపాటే కాదు ఐదు పొరపాట్లు చేశారని అన్నారు. భారత దేశాన్ని పట్టించు కోలేదని కేవలం కాశ్మీర్ సమస్యను మరింత ఉధృతం అయ్యేలా చేశారంటూ ధ్వజమెత్తారు కిరెన్ రిజిజు.
భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి రిజిజు , కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మధ్య కాశ్మీర్ చరిత్ర యుద్దం చెలరేగింది. ఫైవ్ నెహ్రూనియన్ బ్లండర్స్ ఆఫ్ కాశ్మీర్ అని పేర్కొన్నాడు.
దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పూర్తిగా అసంబద్దమని, అసత్యమని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ది పొందేందుకే కేంద్ర మంత్రి మాట్లాడారంటూ ఆరోపించారు.
Also Read : జ్ఞాన్ వాపి కేసు విచారణపై ఉత్కంఠ