kiren Rijiju : రాహుల్ కామెంట్స్ రిజిజు సీరియస్
ముస్లిం లీగ్ పార్టీ సెక్యులర్ ఎలా అవుతుంది
kiren Rijiju : కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నిప్పులు చెరిగారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం లీగ్ అనేది సెక్యులర్ పార్టీ అని స్పష్టం చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది. తాజాగా కేంద్ర మంత్రి రిజిజు(Kiren Rijiju) మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ పరిణతి చెందిన నాయకుడిగా మాట్లాడటం లేదని ఆరోపించారు. ఆయన పనిగట్టుకుని భారత దేశానికి సంబంధించిన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మత ప్రాతిపదికన భారత దేశపు విభజనకు బాధ్యత వహించిన మహమ్మద్ అలీ జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్ ఎలా సెక్యులర్ పార్టీ అవుతుందని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు ఉండడం వల్లనే దేశంలో అల్లర్లు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు కిరెన్ రిజిజు.
జిన్నా ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీనా , మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణమైన పార్టీ లౌకిక పార్టీ నా, దేశంలోని కొంత మంది ఇప్పటికీ ముస్లిం లీగ్ కు మద్దతు ఇచ్చే వ్యక్తిని సెక్యులర్ గా ఎలా పరిగణిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కిరెన్ రిజిజు.
Also Read : Rahul Gandhi