Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి
పార్టీ హై కమాండ్ సంచలన నిర్ణయం
Kishan Reddy : భారతీయ జనతా పార్టీ హై కమాండ్ సంచలన ప్రకటన చేసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్ రెడ్డిని నియమించింది. చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బండి సంజయ్. వివాద రహితుడిగా ఉన్న కిషన్ రెడ్డి(Kishan Reddy) వైపు అధిష్టానం మొగ్గింది. గత కొంత కాలంగా బీజేపీలో అంతర్గత కలహాలు చోటు చేసుకోవడం, కొత్త వారికి పాత వారికి మధ్య సమన్వయం కొరవడడంతో పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండిని పక్కన పెట్టింది.
ఇదే సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఒకనాడు పుస్తెలమ్మి బరిలోకి దిగిన బండి సంజయ్ కు రూ. 100 కోట్ల యాడ్స్ ఇచ్చే ఆదాయం ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. ఈ తరుణంలో పార్టీ హై కమాండ్ సీరియస్ కావడంతో ఎమ్మెల్యే మాట మార్చారు. తాను నిబద్దత కలిగిన కార్యకర్తనని, ఏదో సరదాకు అంటే దానిని సీరియస్ గా తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు
మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో రాబోయే ఎన్నికల్లో ఢీకొట్టేందుకు బీజేపీ తెలివిగా కిషన్ రెడ్డిని పార్టీ చీఫ్ గా నియమించినట్లు టాక్. ముందు నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా కేంద్ర మంత్రిగా అపారమైన అనుభవం ఉండడంతో కిషన్ రెడ్డికి ప్రయారిటీ ఇచ్చింది. .
Also Read : Bandi Sanjay Resign : బండి సంజయ్ రాజీనామా
