Kishan Reddy : తెలంగాణ‌లో మార్పు త‌థ్యం

క‌మ‌లానికి భారీగా సీట్లు

Kishan Reddy : సికింద్రాబాద్ – రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని డిసైడ్ అయ్యార‌ని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిష‌న్ రెడ్డి(Kishan Reddy). ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సికింద్రాబాద్ లో పార్టీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. దేశంలో సుస్థిర‌మైన పాల‌న అందిచే స‌త్తా ఒక్క బీజేపీకి మాత్ర‌మే ఉంద‌న్నారు.

Kishan Reddy Comment

రాష్ట్రంలో త‌మ పార్టీ నిర్ణ‌యాత్మ‌క‌మైన పాత్ర పోషించ బోతోంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. 40 ల‌క్ష‌ల‌కు పైగా నిరుద్యోగులు ఉన్నార‌ని వారిని నిట్ట నిలువునా మోసం చేశారంటూ వాపోయారు. తాము గ‌నుక ప‌వ‌ర్ లోకి వ‌స్తే వెంట‌నే జాబ్స్ ను భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇవాళ యువ‌త తీవ్ర‌మైన నిరాశ‌లో ఉంద‌న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్క‌టేన‌ని మండిప‌డ్డారు. మోసం చేయ‌డం తప్పా చేసింది ఏమీ లేద‌న్నారు కిష‌న్ రెడ్డి. జ‌నం కేసీఆర్ మాయ మాట‌ల‌ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ప్ర‌జ‌లు ఛీత్క‌రించు కుంటున్నార‌ని , చేసిన మోసం త‌ల్చుకుని బాధ ప‌డుతున్నార‌ని అన్నారు బీజేపీ చీఫ్‌.

Also Read : KJ George : క‌రెంట్ పై చ‌ర్చించేందుకు రెడీ

Leave A Reply

Your Email Id will not be published!