Kishan Reddy : టీఆర్ఎస్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్
అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు
Kishan Reddy : భాగ్యనగరం ఓ వైపు కాషాయమయం కాబోతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది భారతీయ జనతా పార్టీ.
రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా నగరాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదే సమయంలో దేశంలోని అతిరథ మహారథులంతా ఇక్కడికి రానున్నారు. దీంతో దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఇక్కడ మోది ప్రసంగిస్తారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు , కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని చెప్పారు.
మూడు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రజలంతా మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఈ సమావేశాలకు దేశంలోని 18 మంది సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలంతా హాజరవుతారని చెప్పారు కిషన్ రెడ్డి.
ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోందంటూ ఆరోపించారు.
పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
Also Read : తెలంగాణలో కేసీఆర్ ఖేల్ ఖతం
మీరు చేస్తే సంసారం