Kishan Reddy Sworn : బీజేపీ చీఫ్ గా కొలువు తీరిన కిషన్ రెడ్డి
పార్టీ ఆఫీసులో సంతకం చేసిన గంగాపురం
Kishan Reddy Sworn : గంగాపురం కిషన్ రెడ్డి శుక్రవారం తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో సంతకం చేయించారు మాజీ పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ , రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు.
Kishan Reddy Sworn Program
అంతకు ముందు కిషన్ రెడ్డి(Kishan Reddy) హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మ వారికి పూజలు చేశారు. అక్కడి నుంచి గన్ పార్క్ కు చేరుకున్నారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు, బలిదానాల వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు కిషన్ రెడ్డి. కానీ కల్వకుంట్ల కుటుంబం వారి కుటుంబాలను విస్మరించిందన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపై పోరు సాగిస్తామన్నారు ఈ సందర్బంగా బీజేపీ చీఫ్. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని , ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ పవర్ లోకి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Also Read : Kathi Karthika Goud : దొర పాలనలో పేదలకు ఇళ్లేవి