KJ George : క‌రెంట్ పై చ‌ర్చించేందుకు రెడీ

కేటీఆర్, కేసీఆర్ కు మంత్రి జార్జ్ స‌వాల్

KJ George: హైద‌రాబాద్ – క‌ర్ణాట‌క‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌క్రమంగా ఇవ్వ‌డం లేదంటూ ప‌దే ప‌దే నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల‌పై నిప్పులు చెరిగారు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేజీ జార్జ్. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం త‌మ‌పై బుర‌ద చ‌ల్ల‌డం మానుకోవాల‌ని అన్నారు.

KJ George Slams KCR and KTR

ద‌మ్ముంటే తాను స‌వాల్ చేస్తున్నాన‌ని, విద్యుత్ స‌ర‌ఫరాపై చ‌ర్చించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. గురువారం జార్జ్(KJ George) మీడియాతో మాట్లాడారు. మీరు ఇక్క‌డికి వ‌చ్చినా స‌రే లేక తాను అక్క‌డికి ర‌మ్మ‌న్నా స‌రే వివ‌రాలు తెలియ చేసేందుకు సిద్ద‌మై ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

ఇందుకు సంబంధించి మీకే తాను స‌మ‌యం ఇస్తున్నాన‌ని, సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు గాంధీ భ‌వ‌న్ లోనే ఉంటాన‌ని పూర్తి భ‌ద్ర‌త‌తో రావాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే బీఆర్ఎస్ ప‌నై పోయింద‌న్నారు. దానిని క‌ప్పి పుచ్చుకునేందుకు కావాల‌ని క‌ర్ణాట‌క‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు మంత్రి జార్జ్. దీంతో మంత్రి చేసిన స‌వాల్ కు ఇంకా కేసీఆర్, కేటీఆర్ నుంచి స్పంద‌న రాలేదు.

Also Read : Piyush Goyal : కేసీఆర్ కుటుంబం అవినీతిమ‌యం

Leave A Reply

Your Email Id will not be published!