kodali Nani : చిరంజీవిని పకోడి గాడని అనలేదు
మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్
kodali Nani : ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ లో ప్రస్తుతం మెగాస్టార్ టాప్ లో కొనసాగుతున్నారని అన్నారు.
kodali Nani Said about Chiranjeevi
తనకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆయన గతంలో ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు తాను కూడా అభినందనలు తెలియ చేయడం జరిగిందని చెప్పారు. బుద్ది ఉన్న వాడు ఎవడైనా శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవి గురించి వ్యతిరేకంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు కొడాలి నాని(Kodali Nani).
చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. కొందరు కావాలని తనకు, మెగాస్టార్ కు మధ్య అగాధం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జనసేన సైనికులు, టీడీపీ ఆవారాగాళ్లు తనను టార్గెట్ చేసినా ఏమీ పీక లేరన్నారు కొడాలి నాని.
ఇదే సమయంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని ఏకి పారేశారు . చంద్రబాబు నైనా వాడి బాబు ఖర్జూర నాయుడైనా , వాడి తాత లవంగం నాయుడైనా, వాటి ముత్తాత యాలక్కాయ నాయుడినైనా అంటామన్నారు. కానీ మెగాస్టార్ ను ఎన్నడూ అనలేదన్నారు.
Also Read : TTD Donate : టీటీడీకి క్వాంటం ఎనర్జీ విరాళం