Kodali Nani Chandrababu : ఇంకా ఎంత మందిని చంపుతావు

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి

Kodali Nani Chandrababu : గుంటూరులో చంద్ర‌బాబు చేప‌ట్టిన చంద్ర‌న్న కానుక కార్య‌క్ర‌మంలో తీవ్ర తొక్కిస‌లాట చోటు చేసుకుంది. భారీగా త‌ర‌లి వ‌చ్చారు. ఈ తొక్కిస‌లాట‌లో ముగ్గురు మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవ‌ల కందుకూరులో చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌భ‌లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై వైసీపీ మంత్రి ర‌జ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ చావుల‌కు బాధ్య‌త చంద్ర‌బాబుదేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) స్పందించారు. ఆయ‌న టీడీపీ చీఫ్ పై నిప్పులు చెరిగారు. ఇంకా ఎంత మందిని చంపాల‌ని అనుకున్నావో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబుకు వ‌య‌స్సు పెరిగినా బుద్ది న‌శిస్తోంద‌న్నారు. ప్ర‌చార యావ‌తో జ‌నాన్ని చంప‌డం ప‌నిగా పెట్టుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ చావుల‌కు ప్ర‌ధాన కార‌కుడు చంద్ర‌బాబేన‌ని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న య‌మ ర‌థంతో ప్ర‌జ‌ల‌ను చంపుతున్నారంటూ మండిప‌డ్డారు కొడాలి నాని.

ఇదిలా ఉండ‌గా భ‌ద్ర‌తా లోపం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగిందంటూ సిగ్గులేకుండా చంద్ర‌బాబు మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు మాజీ మంత్రి. కానుక‌లు ఇస్తామ‌ని ప్ర‌లోభాల‌కు గురి చేశార‌ని ఇక‌నైనా ఇలాంటి చ‌వ‌కబారు జిమ్మిక్కులు చేయొద్దంటూ సూచించారు కొడాలి నాని(Kodali Nani). ఏడాది చివ‌ర ఎనిమిది మందిని, కొత్త ఏడాది ప్రారంభంలో ముగ్గురిని బ‌లిగొన్న రాక్ష‌సుడు బాబు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బాబు చేప‌ట్టే స‌భ‌ల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌కూడ‌ద‌న్నారు కొడాలి నాని.

Unemployment Rate : భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు

Leave A Reply

Your Email Id will not be published!