Kodali Nani : ప‌కోడిగాళ్లు స‌ల‌హా ఇస్తే ఎలా – నాని

మెగాస్టార్ చిరంజీవికి స్ట్రాంగ్ కౌంట‌ర్

Kodali Nani : ఏపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మీదే ఎక్కు పెట్టారు మాట‌ల్ని. సినిమా ఇండ‌స్ట్రీలో పాట‌లు, ఫైట్లు చూసుకోక రాజ‌కీయాలు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. విచిత్రం ఏమిటంటే చాలా మంది ప‌కోడిగాళ్లు ప్ర‌భుత్వం ఎలా ఉండాలో , ఏం చేయాలో అని సూచ‌న‌లు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారం కొడాలి నాని(Kodali Nani) మీడియాతో మాట్లాడారు.

Kodali Nani Shocking Comments

ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ, నోరు పారేసుకుంటూ నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్న వారెవ‌రో ఆయ‌న‌కు తెలియ‌దా అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం గురించి మ‌నం ఎందుకు మాట్లాడాలి అంటూ వాళ్ల‌కు కూడా స‌ల‌హాలు ఇవ్వొచ్చు క‌దా అని అన్నారు కొడాలి నాని.

ఇదిలా ఉండ‌గా వాల్తేరు వీర‌య్య 200 రోజుల పూర్త‌యిన సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చిరంజీవి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సినిమా హీరోల రెమ్యూన‌రేష‌న్ గురించి ప్ర‌భుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయంటూ ప్ర‌శ్నించారు. పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రం లాగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మీద ఎందుకు ప‌డుతున్నారంటూ నిల‌దీశారు. ప్ర‌త్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల గురించి ఆలోచించాల‌న్నారు. పేద వారి క‌డుపు నింపే ఆలోచ‌న‌లు చేయాల‌ని ఓ ఉచిత స‌ల‌హా పారేశారు.

Also Read : Jayaprakash Narayan : గ‌ద్ద‌ర్ పై నోరు పారేసుకున్న జేపీ

Leave A Reply

Your Email Id will not be published!