Kodandaram : నిశ్శ‌బ్ద విప్ల‌వం రాబోతోంది

టీజేఎస్ చీఫ్ కోదండ‌రాం

Kodandaram : హైద‌రాబాద్ – తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ కోదండ‌రాం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో నిశ్శ‌బ్ద విప్ల‌వం రాబోతోంద‌ని జోష్యం చెప్పారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎలాంటి చైత‌న్యం క‌లిగి ఉన్నారో అంత‌కంటే ఎక్కువ స్థాయిలో ఈసారి త‌మ ప్ర‌తాపాన్ని చూపించ బోతున్నార‌ని పేర్కొన్నారు.

Kodandaram Comment

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంద‌ని, ఇది పూర్తిగా ప్ర‌భుత్వ వ్య‌తిరేకత‌ను తెలియ చేస్తోంద‌ని అన్నారు కోదండ‌రాం(Kodandaram). సీఎం కేసీఆర్ ను ఉంచాలా వ‌ద్దా అన్న దానిపై ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు.

ఏ పార్టీకి మొగ్గు చూపుతార‌ని అనుకుంటే ప్ర‌ధానంగా ప్ర‌జ‌లు అస‌లైన‌, సిస‌లైన తీర్పు ఇచ్చేందుకు సిద్ద‌మై ఉన్నార‌ని, వారు ఈ మేర‌కు నిర్ణ‌యం కూడా తీసుకున్నార‌ని స్ప‌ష్టం చేశారు . ఈసారి ఫలితం సునామీలా రాబోతోంద‌ని అది నిన్న‌టి దాకా తానే సుప్రీం అనుకుంటూ విర్ర వీగుతున్న బీఆర్ఎస్ నేత‌ల‌కు బిగ్ షాక్ త‌గ‌ల‌క త‌ప్ప‌ద‌ని జోష్యం చెప్పారు కోదండ‌రాం.

ఇదిలా ఉండ‌గా ప్ర‌జ‌లు ఎంతో కాలం భ‌రించార‌ని, ఇక త‌ట్టుకునే ప‌రిస్థితుల్లో లేర‌ని పేర్కొన్నారు. ఈ ఫ‌లితం ఊహించ‌ని రీతిలో ఉండ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Lok Poll Survey : ఆ పార్టీకే గెలిచే ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!