Kodandaram : ఉద్యోగుల ఆనందం కోదండరాం సంతోషం
సచివాలయంలో మిన్నంటిన సంబురం
Kodandaram : హైదరాబాద్ – ఇన్నేళ్ల పోరాటం తర్వాత అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. తొమ్మిదిన్నర ఏళ్లుగా తాము నరకం అనుభవించామంటూ నగరంలోని సచివాలయం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమ ఇబ్బందులు తొలగి పోతాయని అభిప్రాయపడ్డారు.
Kodandaram Comment
వందలాది మంది ఉద్యోగులు సెక్రటేరియట్ గేటు ముందుకు వచ్చి సంబురాలు చేసుకున్నారు. మరికొందరు దివంగత ప్రజా గాయకుడు, యుద్ద నౌక గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అన్న పాటకు డ్యాన్సు చేస్తూ హోరెత్తించారు. బై బై కేసీఆర్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.
ఈ సందర్బంగా టీజేఎస్ చీఫ్ కోదండరాం(Kodandaram) ఉద్యోగుల వద్దకు వచ్చారు. గడీల దొరల పాలన అంతమై పోయిందని, ప్రజా పాలన రానుందన్నారు. ఇక ఇన్ని ఏళ్ల పాటు చేసిన పోరాటానికి అసలైన ప్రతిఫలం ఇవాళ దక్కిందన్నారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయక పోవడం వల్ల అదనపు పని భారం పెరిగిందన్నారు. ఇక రావాల్సింది ప్రజా తెలంగాణ మాత్రమే మిగిలి ఉందన్నారు కోదండరాం.
Also Read : Revanth Reddy Meeting : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు