M Kodandaram : కేసీఆర్ పై కన్నెర్ర కోదండరాం దీక్ష
కేసీఆర్ అవినీతిపై ప్రచాం
M Kodandaram : తెలంగాణ జన సమితి (టీజేఎస్) చీఫ్ కొదండరాం(M Kodandaram) కీలక ప్రకటన చేశారు. ఈనెల 10న నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. 20న ధరణి పోర్టల్ సమస్యలపై సదస్సు చేపడతామన్నారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు.
ఎంత సేపు తాను, తన కుటుంబం వరకే చూసుకుంటున్నారని , ప్రజా సమస్యలను గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు కోదండరాం. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రశ్నిస్తే తట్టుకోలేని కేసీఆర్ అరెస్ట్ లు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఉద్దరించ లేని సీఎం ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు కోదండరాం(M Kodandaram).
జనవరి 30న దేశ రాజధానిలో సెమినార్ ను నిర్వహిస్తామన్నారు. 31న విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఆందోళన చేపడతామని ప్రకటించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి పోయి ఎటు పోవాలో అర్థం కాక పరేషాన్ లో ఉన్నారని అన్నారు.
ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుందని , నీళ్లు , నిధులు , నియామకాల ఆకాంక్ష ఇంకా నెర వేరలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ దందాతో ఎమ్మెల్సీ కవితకు ఏం పని అని ప్రశ్నించారు కోదండరాం. తెలంగాణను కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఉద్యమ అమరులను, తెలంగాణ వాదాన్ని అవహేళన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరాం. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడంటూ ఆరోపించారు.
Also Read : ఆర్టీసీ ఉద్యోగుల శ్రమకు సలాం