Kodandaram : నియంత పాలన పోయింది
ఉద్యోగులకు స్వేచ్ఛ లభించింది
Kodandaram : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో సచివాలయంలో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ సర్కార్ సాగించిన నిర్బంధ కాండ గురించి ఏకరవు పెట్టారు. ఉద్యోగ సంఘాల నేతలు తమను వాడుకున్నారని, వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. సెక్రటేరియట్ గేటు బయట టపాసులు పేల్చారు, స్వీట్లు పంచుకున్నారు.
Kodandaram Comment
పలువురు ఉద్యోగులు డ్యాన్సులతో హోరెత్తించారు. ప్రస్తుత పాలనలో తమకు స్వేచ్చ లభిస్తుందని నమ్ముతున్నామని అన్నారు. ఇంత కాలం తాము నిర్బంధంలోనే కొనసాగుతూ భయం భయంగా విధులు నిర్వహిస్తూ వచ్చామని వాపోయారు. ఎవరి కోసం ఈ సచివాలయం కట్టారో కేసీఆర్ కే తెలియాలని అన్నారు.
ఈ సందర్బంగా ఉద్యోగుల వద్దకు తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చారు. ఆయనకు సంఘీభావం తెలిపారు. మీడియాతో మాట్లాడిన కోదండరాం(Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. నియంత పీడ విరగడైందని అన్నారు. ఇక ఉద్యోగులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించు కోవచ్చని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతోనే ఉద్యోగుల హఖ్కులను హరించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందన్నారు.
Also Read : Revanth Reddy : ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న సీఎం