Kodela Sivaram : బాబుపై గుస్సా కన్నాపై కన్నెర్ర
కోడెల శివరామ్ షాకింగ్ కామెంట్స్
Kodela Sivaram : దివంగత, మాజీ మంత్రి కోడెల్ శివ ప్రసాద్ తనయుడు కోడెల శివరాం(Kodela Sivaram) సంచలన కామెంట్స్ చేశారు. కనీసం తమకు మాట్లాడేందుకు పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు 5 నిమిషాల టైం ఇవ్వలేదని వాపోయారు. ఇదే సమయంలో ఇటీవలే పార్టీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై నిప్పులు చెరిగారు. తండ్రి చని పోయినప్పటి నుండి కోడెల శివరాం సత్తెన్నపల్లి లో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
ఆయన పార్టీ తరపున ఇక్కడి నుంచి ఈసారి బరిలోకి దిగాలని అనుకుంటుననారు. ఈ తరుణంలో ఊహించని రీతిలో కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇక్కడి నుంచే బరిలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో కోడెల శివరామ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. ప్రస్తుతానికి పార్టీ కూడా కన్నా వైపు మొగ్గు చూపినట్లు వినిపిస్తోంది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు కోడెల శివరామ్. ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ మూడు పార్టీలు మారారని ఆరోపించారు. పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసిన తన తండ్రికి కన్నాకు పోలిక ఏమిటంటూ ప్రశ్నించారు.
గుంటూరు జిల్లాలో కోడెల్ వర్సెస్ కన్నా వర్గంగా ఉండేదన్నారు. తాను పవర్ లో ఉన్న సమయంలో ఎన్నో కేసులు పెట్టించినా తన తండ్రి కాపాడారని గుర్తు చేశారు కోడెల శివరామ్. తనను నమ్ముకున్న వారి కోసం తాను నిలబడతానని చెప్పారు కోడెల శివరామ్.
Also Read : YS Jagan
