Kodi Katti Case : కోడి కత్తి కేసు విచారణ వాయిదా
6 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
Kodi Katti Case : అమరావతి – ఏపీ సీఎం జగన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎంకు వెసులుబాటు ఇస్తూ తీర్పు వెలువరించింది. ఏపీ సీఎం గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో విశాఖ పట్టణం ఎయిర్ పోర్టులో తనపై కోడిని కోసే కత్తితో దాడి జరిగింది. దీనిపై విచారణ కొనసాగుతూ వచ్చింది. దీనికి కొన్నేళ్ల పాటు పట్టింది. ఇంకా తీర్పు వెలువడలేదు.
Kodi Katti Case Updates
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ పై విచారణ కొనసాగింది. వాదోపవాదనలు విన్న అనంతరం కోడి కత్తి కేసును 6 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం దాగి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
మరింత లోతుగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జగన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) అమరావతిలో కొలువు తీరిన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తుది తీర్పు వెలువరించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read : AP DIG Ravi Kiran : బాబు ములాఖత్ పై ఆంక్షలు