Kodi Katti Case : కోడి కత్తి కేసుపై విచారణ
హైకోర్టును ఆశ్రయించిన జగన్
Kodi Katti Case : అమరావతి – ఏపీ సీఎం వైఎస్ జగన్ కోడి కత్తి కేసుపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రెడ్డిపై కోడి కత్తితో దాడికి గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇదే కేసుకు సంబఃధించి కుట్ర కోణం దాగి ఉందని , లోతైన దర్యాప్తు జరుపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Kodi Katti Case Viral
ఈ కేసులో లోతైన దర్యాప్తునకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఏఐ కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. జూలై 25న ఎన్ఐఏ కోర్టు జగన్(YS Jagan) విజ్ఞప్తిని తిరస్కరించడాన్ని జీర్ణించు కోలేక పోయారు సీఎం. దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ కు నేర చరిత్ర ఉన్నా కూడా క్యాంటీన్ ఓనర్ పనిలో పెట్టుకున్నాడని దాఖలు చేసిన పిటిషన్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. ఇవాళ హైకోర్టులో జగన్ పిటిషన్ పై విచారణకు చేపట్టనున్నారు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి.
Also Read : YS Sharmila Vijayamma : రెండు చోట్ల తల్లీకూతుళ్లు పోటీ