TTD : ప్రతి ఏటా నిర్వహించే ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ఈనెల 29న మంగళవారం శాస్త్రోక్తంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారం(TTD) జరగనుంది.
ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సరం ఉగాది ఆస్థానం జరగనుంది. ఇక ప్రతి ఏటా నాలుగు సార్లు స్వామి వారికి కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పూజాల్లో భాగంగా ఉదయం 6 నుంచి 11 గంటల దాకా ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
ప్రాంగణంలోని ఆనంద నిలయం మొదలు కొని బంగారు వాకిలి దాకా శుద్ధ జలంతో శుభ్రం చేస్తారు. అంతే కాకుండా శ్రీవారి ఆలయం లోపట ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి, తదితర వస్తువులను నీటితో కడుగుతారు.
ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలుమంగమ్మ లకు పూజలు చేస్తారు. శుభ్రంగా కడిగిన తర్వాత స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి వేస్తారు.
శుద్ది అనంతరం శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, కర్పూరం, గంధం పొడి, కుంకుమ, తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన జలాన్ని ఆలయం చుట్టూరా చల్లుతారు.
అనంతరం మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాన్ని సమర్పిస్తారు. అప్పటి దాకా భక్తులకు ఎలాంటి ప్రవేశం ఉండదు. సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.
Also Read : ఇక యాదగిరిగుట్ట దివ్య దర్శనం