Kollu Ravindra : కలెక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న నాని
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్
Kollu Ravindra : కైకలూరులో వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని అక్రమంగా చెరువులను ఆక్రమించాడని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra). ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మండిపడ్డారు. నిషేధిత భూముల్లో పేర్ని నాని యథేశ్చగా అక్రమంగా తవ్వకాలు చేపట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన బందరు ప్రజల కోసం సీఎం ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయలేదంటూ ప్రశ్నించారు కొల్లు రవీంద్ర.
Kollu Ravindra Said
పట్టణంలో పేర్ని నాని కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. త్వరలో ప్రజలు పేర్నికి బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఇంత కాలం ప్రజా ప్రతినిధిగా ఉన్న పేర్ని నాని చేసింది ఏమీ లేదన్నారు. కేవలం నారా చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను తిట్టడం తప్ప ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు.
గత ప్రభుత్వంలో తాము మంజూరు చేసి మొదలు పెట్టిన పనులు ఎందుకు ఇంకా పూర్తి చేయలేదన్నారు. జిల్లా మంత్రి రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారని, కనీసం బీచ్ అభివృద్దికి నిధులు మంజూరు చేయలేదన్నారు.
జ్యూవెలరీ పార్కులో కళ్యాణ మండపం, చిన్నాపురం మంచి నీటి పైప్ లైన్ కోసం రూ 11 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. మంచినీటి శుద్ది ప్లాంట్ , మున్సిపల్ ఆఫీస్ , ఉల్లిపాలెం బ్రిడ్జి, మంచినీటి ట్యాంక్ లాంటి అనేక అభివృద్ది పనులు చేశామని వాటిని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని పేర్ని నానిని డిమాండ్ చేశారు కొల్లు రవీంద్ర.
Also Read : AP CM YS Jagan : వాలంటీర్లను దూషిస్తే ఒప్పుకోను