Komati Reddy Raja Gopal Reddy : హ‌స్తం వైపు ‘కోమ‌టిరెడ్డి’ చూపు

ఎల్బీ న‌గ‌ర్ టికెట్ ఇస్తే ఓకే

Komati Reddy Raja Gopal Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఆయా పార్టీలలోకి టికెట్లు రాని వాళ్లు, ఆశించిన స్థాయిలో స‌పోర్ట్ దొర‌కని వాళ్లు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల‌లో జంప్ అవుతున్నారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా, ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉన్నారు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.

Komati Reddy Raja Gopal Reddy Come Back

ఆయ‌న గ‌తంలో హ‌స్తాన్ని వీడారు. ఆపై క‌మ‌లం పార్టీలోకి జంప్ అయ్యారు. అమిత్ షా స‌మ‌క్షంలో తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మునుగోడు లో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. కానీ ఊహించ‌ని రీతిలో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీ జెండా ఎగుర‌వేసింది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేశారు. కోట్లు, మ‌ద్యం విచ్చ‌లవిడిగా స‌ర‌ఫ‌రా చేశార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

ఆ త‌ర్వాత పార్టీలో మౌనంగా ఉంటూ వ‌చ్చారు. తాజాగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి(Komati Reddy Raja Gopal Reddy) బీజేపీ ప‌ట్ల నిరాశ‌క్త‌తో ఉన్న‌ట్లు ఆ మ‌ధ్య‌న ప్ర‌చారం జ‌రిగింది. దీనిని నిజం చేస్తూ కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

త‌ను బీజేపీని వీడ‌నున్న‌ట్లు టాక్. తిరిగి స్వంత గూటికి చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే త‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌స్తుతం భువ‌న‌గిరి ఎంపీగా ఉన్నారు. తాను ఎల్బీ న‌గ‌ర్ టికెట్ అడుగుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : IND vs NZ ICC World Cup : కోహ్లీ షాన్ దార్ భార‌త్ జోర్దార్

Leave A Reply

Your Email Id will not be published!