Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ కు ‘కోమటిరెడ్డి’ గుడ్ బై
సోనియాను తిట్టినోడి కింద పని చేయను
Komatireddy Raj Gopal Reddy : అంతా అనుకున్నట్టే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
మంగళవారం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఒకప్పుడు సోనియా గాంధీని తిట్టిన రేవంత్ రెడ్డి కింద తాను ఎలా పని చేస్తానంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదన్నారు. అధికార పార్టీపై పోరాడడం లేదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం బలంగా లేదన్నారు.
అందుకే తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేక పోయానని వాపోయారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy).
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకు పోతోందన్నారు. హై కమాండ్ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్ కు ఆదరణ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
తన పోరాటం కుటంబ పాలనకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసమే రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. మునుగోడులో ఎవరు గెలుస్తారనేది నా నియోజకవర్గ ప్రజలే తేలుస్తారని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
నేను ఏం తప్పు చేశానని తనపై కాంగ్రెస్ ఎందుకు చర్య తీసుకుంటుందని ప్రశ్నించారు. సోనియా గాంధీ దేవత. ఆమెను నేను విమర్శించ దల్చుకోలేదని స్పష్టం చేశారు. తన వ్యాపారాల కోసం ఏనాడూ పార్టీని ఉపయోగించు కోలేదని చెప్పారు.
Also Read : కేసీఆర్ అవినీతిలో అనకొండ