Komatireddy Raj Gopal Reddy : నిన్న జంప్ నేడు టికెట్
రాజగోపాల్ రెడ్డినా మజాకా
Komatireddy Raj Gopal Reddy : హైదరాబాద్ – ఆయా రాం గాయా రాంలకు అడ్డాగా మారాయి పార్టీలు. వీళ్లు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పదవులు అనుభవించారు. ఆపై ఆ పార్టీని తిట్టిన తిట్లు తిట్టకుండా బీజేపీలోకి జంప్ అయ్యారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy Raj Gopal Reddy). ఆ వెంటనే ఉప ఎన్నికల బరిలో నిలిచారు. కోట్లు ఖర్చు చేశారు. చివరకు ఓటమి పాలయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో.
Komatireddy Raj Gopal Reddy Got MLA Ticket
ఏమైందో ఏమో కానీ మనసు మార్చుకున్నారు. తమ్ముడు ఎలాగూ ఎంపీగా ఉన్నారు. ఇంకేం చక్రం తిప్పారు. చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే రెండో జాబితాలో ఎవరూ ఊహించని రీతిలో మునుగోడు టికెట్ తెచ్చుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఈ లెక్కన చూస్తే అన్నదమ్ములు ఎంత పవర్ ఫుల్ అనేది ఈ టికెట్ల వ్యవహారాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. జడ్చర్ల నియోజకవర్గంలో అత్యధిక బీసీ ఓటు బ్యాంక్ కలిగి ఉన్నా అక్కడ ఎర్ర శేఖర్ కు టికెట్ రాకుండా కోమటిరెడ్డి తన అనుచరుడు అనిరుధ్ రెడ్డికి టికెట్ ఇప్పించు కోవడంలో సక్సెస్ అయ్యాడు
. ఇక తనతో పాటు తన అన్న, అనుచరుడికి టికెట్ దక్కడంతో కోమటిరెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనని మరోసారి తేలి పోయింది.
Also Read : Vennela Gaddar : ఎట్టకేలకు వెన్నెల గద్దర్ కు ఛాన్స్