Komatireddy Rajagopal Reddy : జ‌నం కోరితే రాజీనామాకు సిద్దం

సోనియ‌మ్మ అంటే గౌర‌వం

Komatireddy Rajagopal Reddy : గ‌త కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారంటూ వ‌స్తున్న ప్ర‌చారం నేప‌థ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ఎట్టకేల‌కు స్పందించారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు ప్ర‌జ‌లు కోరితే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

తాను కేంద్ర మంత్రి అమిత్ షాతో క‌లిసిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. కానీ రాజీనామా గురించి కానీ , రాజ‌కీయాల గురించి కానీ చ‌ర్చించ లేద‌న్నారు.

రాష్ట్రాన్ని కేసీఆర్ ఎలా దోచుకుంటున్నాడో, ఎలా అప్పులపాలు చేశాడో మాత్ర‌మే చెప్పాన‌ని తెలిపాడు. కాంగ్రెస్ పార్టీ అనేది సాధు జంతువు లాంటిద‌ని, దానిని చంపేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నానంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఒక‌వేళ పార్టీ మారాల్సి వ‌స్తే గ‌నుక విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయ నాయ‌కుడిగా త‌ప్పుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) . తాను షాతో క‌ల‌వ‌గానే కేసీఆర్ భ‌యంతో వ‌ణుకుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

ఎవ‌రి ట్రాప్ లో ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. న‌ల్ల‌గొండ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్  కు ఓ చ‌రిత్ర ఉంద‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు రాజ‌గోపాల్ రెడ్డి.

రంగులు మార్చు కోవాల్సిన ఖ‌ర్మ త‌న‌కు లేద‌న్నారు. పార్టీలో అనేక అవ‌మానాలు ఎదురైనా ఉన్నాన‌ని అన్నారు. పార్టీ అంటే అభిమానం..సోనియా గాంధీ అంటే గౌరవం ఉంద‌న్నారు.

టీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే ఒక్క బీజేపీకే సాధ్య‌మ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

Also Read : కాంగ్రెస్ నేత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు 

Leave A Reply

Your Email Id will not be published!