Komatireddy Rajagopal Reddy : నా జెండా ఎజెండా బీజేపీనే
మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
Komatireddy Rajagopal Reddy : కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పవర్ ను కోల్పోయింది. ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. 136 సీట్లను సాధించి విస్తు పోయేలా చేసింది. ఈ తరుణంలో తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన మునుగోడులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదే పదే పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని ఆరోపించారు.
తాను ఎక్కడికీ వెళ్లనని తన ప్రస్థానం కేవలం కాషాయంతోనే ఉంటుందన్నారు. తన జెండా , ఎజెండా కూడా పూర్తిగా బీజేపీ తప్ప మరొకటి కాదన్నారు. కొందరు కావాలని తనపై వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలని ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పదవి ఉన్నా లేక పోయినా బీజేపీని వీడనని, కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Also Read : DK Suresh