Komatireddy Rajgopal Reddy : డ్రామారావు ఆట‌లు సాగ‌వు

కోమ‌టిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Komatireddy Rajgopal Reddy : మునుగోడులో రాజ‌కీయాలు మ‌రింత హీట్ ఎక్కాయి. న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌ధాన పార్టీల‌తో పాటు ప‌లువురు పోటీలో నిలిచినా అస‌లైన పోరు మాత్రం తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల మ‌ధ్యే నెల‌కొంది. ఇక బీఎస్పీ, తెలంగాణ జ‌న స‌మితి, మ‌హా విషాద‌ర‌న్ తో పాటు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.

బీజేపీ నుంచి బ‌రిలో ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy) విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కొంత అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. దీనిని టీఆర్ఎస్ ట్రోల్ చేసింది. కావాల‌నే ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకే అలా చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు గుప్పిందారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు రాజగోపాల్ రెడ్డి. టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను ఆయ‌న డ్రామారావుగా అభివ‌ర్ణించారు. తానేమిటో త‌న ప‌నితీరు ఏమిటో మునుగోడు ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.

తాను రాజీనామా చేయడంతో ఇవాళ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గానికి ప‌నులు మంజూరు చేయాల‌ని కోరినా సీఎం ప‌ట్టించు కోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాను ఒక్క‌డు తీసుకున్న నిర్ణ‌యంతో దెబ్బ‌కు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రివ‌ర్గం , ఎమ్మెల్యేలు , ప్ర‌జా ప్ర‌తినిధులు ఇక్క‌డ కొలువు తీరార‌ని మండిప‌డ్డారు.

దీనిపై స‌మాధానం చెప్పాల్సింది సీఎం కేసీఆర్ పై ఉంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చిన పాపాన పోలేద‌న్నారు కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Also Read : 500 రోజుల్లో మునుగోడు పురోభివృద్ది

Leave A Reply

Your Email Id will not be published!