Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి దాదాగిరి
ఎన్నికల వేళ దాడుల వేట
Komatireddy Venkat Reddy : ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటల తూటాలు పేల్చారు. ప్రత్యక్షంగా దాడులకు దిగుతుండడం ఒకింత విస్తు పోయేలా చేసింది. అరాచకాలకు పాల్పడడం ఎంత వరకు సబబు అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా అర్జాల బావి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Komatireddy Venkat Reddy Viral
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంట వచ్చిన అనుచరులు, గూండాల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు ముస్లిం మైనార్టీ నాయకుడు. తనపై కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) స్వయంగా దాడికి పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తాగిన మత్తులో నోటికి వచ్చినట్లు మాట్లాడాడని, ఇది ఎంపీ వెంకట్ రెడ్డికి తగదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యక్ష దాడుల్లో ఎంపీతో పాటు కౌన్సిలర్లు రమేష్, భాస్కర్ గౌడ్ అక్కడి నుంచి ఫిరాయించారంటూ వాపోయారు.
మరో వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు, నేతలు బీఆర్ఎస్ నేతలు, అనుచరులపై దాడులకు దిగుతున్నారని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ నేతల దాదాగిరిపై జనం బెంబేలెత్తుతున్నారు.
Also Read : Bodige Shobhakka : కేసీఆర్ పై యుద్దం గెలుపు ఖాయం