komatireddy Venkat Reddy : గెలుపు ఖాయం నేనే సీఎం
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
komatireddy Venkat Reddy : తెలంగాణ – భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీలో సీఎం అభ్యర్థులు ఇద్దరు లేదా ముగ్గురం ఉన్నామని అన్నారు.
komatireddy Venkat Reddy Comments Viral
వారిలో తాను కూడా ఒకడినని స్పష్టం చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(komatireddy Venkat Reddy). తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో పాతుకు పోయిన బెల్టు షాపులను అన్నింటినీ బంద్ చేస్తానని చెప్పారు. దీంతో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే ఇంకా టికెట్ల పంచాయితీ ముగిసి పోలేదు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఒక్కో నియోజకవర్గానికి ఈసారి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు పార్టీకి పని చేయరనే అనుమానం వ్యక్తం చేస్తోంది పార్టీ.
ఈ టికెట్ల లొల్లి కొనసాగుతుండగానే రోజుకో కామెంట్స్ తో, పూటకో మాటలతో పార్టీకి డ్యామేజ్ చేసే పనిని కొందరు సీనియర్లు చేస్తున్నారనే విమర్శలు లేక పోలేదు. ఇంకా ఎన్నికలు కానేలేదు. అప్పుడే సీఎం అభ్యర్థి గురించి ఎందుకు మాట్లాడాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read : Paleru Congress Ticket : పాలేరుపై తెగని పంచాయతీ
