Komatireddy Venkat Reddy : డీకేకు అంత సీన్ లేదు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ లో మాటల యుద్దం మళ్లీ మొదలైంది. దీనికి కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాండూరు వేదికగా పార్టీ ఆధ్వర్యంలో విజయ భేరి సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు.
Komatireddy Venkat Reddy Comments Viral
ఈ సందర్బంగా జరిగిన సభలో తప్పు దొర్లింది. రామ్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీకే మాట్లాడుతుండగా దానిని తప్పుగా అనువాదం చేశారు. రేవంత్ రెడ్డి కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అని ప్రకటించారు. కానీ డీకే శివకుమార్ మొత్తం ప్రసంగంలో ఎక్కడా రేవంత్ సీఎం అవుతాడని అనలేదు.
దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అని డీకే చెప్పలేదన్నారు.
సీఎం ఎవరనేది డీకే చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరన్నారు. ఒక రకంగా డీకేకు అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా కోమటిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరో వైపు ఇప్పుడే కలలు కంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను ఎక్కడికి వెళ్లినా సీఎం అవుతానని, కల్వకుంట్ల ఫ్యామిలీని జైలుకు పంపిస్తామని ప్రకటిస్తున్నారు.
మొత్తంగా సీఎం పదవిపై పంచాయతీ మొదలు కావడం విస్తు పోయేలా చేస్తోంది పార్టీ శ్రేణులను.
Also Read : Prashant Kishor : సంపద సృష్టించే బాధ్యత ప్రభుత్వాలదే