Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డి చేరిక తెలియ‌దు

భువ‌న‌గిరి ఎంపీ వెంక‌ట్ రెడ్డి

Komatireddy Venkat Reddy : హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న సోద‌రుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విష‌యం తెలియ‌ద‌న్నారు.

Komatireddy Venkat Reddy Comments on Raja Gopal Reddy Joining

ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విష‌యం త‌న పరిశీల‌న‌లోకి రాలేద‌న్నారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చేరే విష‌యం అఖిల భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) చూసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

పార్టీలో చేరే విష‌యం గురించి సోద‌రుడినైన త‌న‌తో చ‌ర్చించ లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవ‌రు వ‌చ్చినా తాము సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతామ‌ని అన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ త‌మ‌ను న‌మ్ముతున్నార‌ని స్ప‌ష్టం చేశారు. అధికార పార్టీ చేస్తున్న ఆగ‌డాల‌ను భ‌రించ‌లేక జ‌నం గ‌గ్గోలు పెడుతున్నార‌ని ఆవేద‌న చెందారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం త‌న స్వంత సోద‌రుడు పార్టీ మారే విష‌యం గురించి చెప్ప‌క పోవ‌డం విడ్డూరంగా ఉందంటున్నారు పార్టీ శ్రేణులు. మొత్తంగా రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌ర‌నేది తేలి పోయింది. ప‌వ‌ర్ పాలిటిక్స్ లో ప‌ద‌వులే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టమైంది.

Also Read : Sunitha Laxma Reddy : సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!