Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పై కోమటిరెడ్డి గుస్సా
పార్టీ కమిటీలలో నో ఛాన్స్
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీపై అలిగారు. హై కమాండ్ ఇటీవల కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. కానీ కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏ కమిటీలలోనూ స్థానం లభించింది.
Komatireddy Venkat Reddy Comments
ఇది ఆయనను , తనను నమ్ముకున్న నేతలు, అనుచరులను విస్తు పోయేలా చేసింది. తాజాగా పార్టీ ప్రకటించిన సీడబ్ల్యూసీ లోనూ, కేంద్ర ఎన్నికల కమిటీలోనూ, తెలంగాణ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి(Komatireddy Venkat Reddy) స్థానం దక్కలేదు.
దీంతో భువనగిరి ఎంపీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో మనస్తాపం చెందారు. విచిత్రం ఏమిటంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మొదట విభేదించారు. ఆ తర్వాత కలిసి పోయారు. తను కూడా కీలకంగా మారారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వచ్చారు.
తన జిల్లాల్లో మరింత బిజీగా మారారు. భావ సారూప్యత కలిగిన పార్టీలు, నాయకులతో చర్చిస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఉన్నట్టుండి పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది.
Also Read : Nataraja Statue : ఆకట్టుకుంటున్న నటరాజ విగ్రహం