Komatireddy Venkat Reddy : అవాస్తవం రాజీనామా అబద్దం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : పలుమార్లు పార్టీని వీడుతారంటూ వస్తున్న ప్రచారం అంతా అవాస్తవమని తాను నిఖార్సైన తెలంగాణ వాదినని, అంతే కాదు కాంగ్రెస్ జెండాను వీడేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). రాజీనామా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. కొందరు పనిగట్టుకుని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు ఎమ్మెల్యే.
ఒకవేళ పార్టీ మారేది ఉంటే తాను చెబుతానని తనకు కపటం అంటూ తెలియదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గురువారం ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను నిత్యం పార్టీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నానని చెప్పారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికలకు గాను ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించాలని తాను కోరారని తెలిపారు.
దీని వల్ల అభ్యర్థుల్లో పూర్తి క్లారిటీ వస్తుందని, ఆ తర్వాత ఇబ్బందులంటూ పార్టీకి ఉండవని స్పష్టం చేశారు. తాను పార్టీ బాగు కోసం, క్షేమం కోసం ప్రయత్నం చేస్తానే తప్పా పార్టీని వీడే ఆలోచన లేదన్నారు. ఎప్పటికీ రాదన్నారు. తన బ్రదర్ పార్టీనంత మాత్రాన తాను మారుతానని అనుకోవడం భ్రమ అని కొట్టి పారేశారు. మొత్తంగా జోరందుకున్న ప్రచారానికి అడ్డుకట్ట వేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పార్టీ మారాలని అనుకుంటే పీసీసీ చీఫ్ పదవి ప్రకటించిన సమయంలోనే మారే వాడినని ఆ ఆలోచన తనకు లేదన్నారు. ఏనాడూ తాను పదవుల కోసం పాకు లాడ లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పదవిని త్యాగం చేసిన ఘనత నాదేనన్నారు.
Also Read : జైల్లోనే బండి సంజయ్