Komatireddy Venkat Reddy : ఓట్ల కోసం సాగర్ రాజకీయం
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లా – నాగార్జున సాగర్ డ్యామ్ నీటి విషయంలో చోటు చేసుకున్న వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్టార్ క్యాంపెయినర్ , సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). సాగర్ డ్యాం వద్ద తెలంగాణ పోలీసులపై దాడికి పాల్పడడం మంచి పద్దతి కాదన్నారు. కావాలని పోలింగ్ రోజు ఇలాంటి వావాదస్పదమైన వ్యవహారాన్ని తెర పైకి తీసుకు వచ్చారని ఆరోపించారు.
Komatireddy Venkat Reddy Comment
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం తప్ప మరోటి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు. సాగర్ డ్యాం వద్ద పోలీసులను మోహరించడం దారుణమన్నారు. కావాలని చేస్తున్న ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
119 నియోజకవర్గాలలో కనీసం 75 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని స్పష్టం చేశారు. హస్తం విజయం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు . కొన్ని చోట్ల ఓటమిని తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ వారిపై దాడులకు దిగుతున్నారని దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read : MLC Kavitha : బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా – కవిత